Viveka Case: అవినాష్ పిటిషన్‌పై 31న తీర్పు.. అప్పటివరకు నో అరెస్ట్
Hyderabad: వైఎస్ వివేకా మర్డర్ కేసులో (viveka case) ప్రధాన నిందితుడైన అనివాష్‌రెడ్డిని (avinash reddy) ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు CBIకి సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును 31న వెల్లడించనున్నట్లు తెలిపింది. అవినాష్ రెడ్డి (avinash reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై 2 గంటలకు కోర్టులో వాదనలు ముగిసాయి. వివేకా (viveka case) బతికున్నప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటర్లు ఓట్లు వేయకపోవడం వల్ల వివేకా ఓడిపోయారని, దానికి అవినాష్‌కి ఏం సంబంధం అని అవినాష్ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో బుధవారం అవినాష్‌కు మళ్లీ నోటీసులు పంపుతామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. సాక్షులను అవినాష్ బెదిరిస్తున్నారని అందుకే వాళ్లు ముందుకు రావడానికి భయపడుతున్నారని సీబీఐ తెలిపింది. సాక్షుల వివరాలను, వారి వాంగ్మూలాలను కోర్టుకు సీల్డ్ కవర్‌లో సబ్మిట్ చేస్తామని పేర్కొంది.
చాలాకాలంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉందని, సామాన్యుల కేసులను కూడా ఇలాగే విచారిస్తారా అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. ఇందుకు సీబీఐ స్పందిస్తూ ఎన్నిసార్లు విచారణకు రావాలని నోటీసులు పంపినా ఏదో ఒక సాకుతో అవినాష్ రావడం లేదని, ఆయన సహకారం లేనప్పుడు ఏమీ చేయలేమని తెలిపింది. ఆయన్ను కస్టోడియల్ ఇన్‌వెస్టిగేషన్ చేస్తేనే జూన్ కల్లా కేసును క్లోజ్ చేయగలుగుతామని పేర్కొంది.