Viveka Case: ఓపికపడుతున్న CBI.. ఈసారి మిస్సైతే….
AP: వైఎస్ వివేకా హత్య కేసులో(viveka case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Ys Avinash Reddy)కి CBI మరోసారి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొనగా.. అవినాష్ తల్లి గుండెపోటుకు గురికావడంతో ఎంపీ హైదరాబాద్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈనేపథ్యంలో నిన్న అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకుండా.. పులివెందులకు వెళ్లిపోవడంపై సీబీఐ అధికారులు సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. మరోవైపు అవినాష్‌కు కూడా గుండెపోటు వచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదని సీబీఐ తాజా నోటీసులతో తేటతెల్లం అవుతోంది. ఈ నెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు అవినాష్‌కు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 16న విచారణకు రావాలని అవినాష్ వాట్సప్‌కు సీబీఐ అధికారులు సందేశం పంపారు. దీనికి రిప్లై ఇచ్చిన ఆయన.. వ్యక్తిగత పనులు ఉండటం వల్ల తాను ఈనెల 22న వస్తానని పేర్కొన్నారు. అయితే.. దానికి సీబీఐ అంగీకరించలేదు. 19న విచారణకు రావాలని పేర్కొనగా.. అవినాష్ హైదరాబాద్‌కు నిన్న చేరుకున్నారు. ఈక్రమంలో ఆయన తల్లికి హార్టస్ట్రోక్ రావడంతో ఆయన అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు.
ఇక సీబీఐ అధికారులు మూడోసారి నోటీసులు జారీ చేయగా.. ఈ దఫా అయినా అవినాష్ హాజరవుతారా లేదా.. అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరైతే అరెస్ట్ చేస్తారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.