“Bhuma Akhila Priya ఓ బ‌జారుది”

AP: TDP నేత భూమా అఖిల ప్రియ(bhuma akhila priya) ఓ బ‌జారుద‌ని, దున్న‌పోత‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు ఏవీ సుబ్బారెడ్డి(av subba reddy) కూతురు జ‌శ్వంతి రెడ్డి(jashwanthi reddy). అఖిల ప్రియ కావాల‌నే త‌న తండ్రిపై దాడి చేయించింది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. “మా నాన్న‌.. భూమా నాగిరెడ్డిగారు మంచి ఫ్రెండ్స్. ఈ బ‌జారు మ‌నిషి అఖిల ప్రియ తండ్రిని కోల్పోయిన‌ప్పుడు మా నాన్న అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఎత్తుకుని పెంచిన తండ్రిలాంటి వారైన సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ కావాల‌నే దాడి చేయించింది. ఈ బ‌జారుది.. ఈ దున్న‌పోతుని ఇంకేమనాలో అర్థంకావ‌డం లేదు. ఇలా దాడి చేయించ‌డం ఇది మొద‌టిసారేం కాదు. గ‌తంలో కూడా మా నాన్న‌ను చంపించేందుకు మా ఇంటి చుట్టూ రెక్కీ చేప‌ట్టింది. పార్టీ నాకు కానీ మా నాన్నకు కానీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాం. అదే నీకు కానీ టికెట్ ఇస్తే మాత్రం నేను మా నాన్న‌, నా వ‌ర్గం నిన్ను ఓడించ‌డానికే కృషి చేస్తాం. నువ్వు చేసిన‌దానికి ఇంత‌కు ఇంత అనుభ‌విస్తావ్. గుర్తుపెట్టుకో” అంటూ నిప్పులు చెరిగారు జ‌శ్వంతి.

బుధ‌వారం TDP జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్(nara lokesh) యువ‌గ‌ళం(yuvagala) పాద‌యాత్ర నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా అఖిల ప్రియ‌తో పాటు TDP సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డి.. లోకేష్‌కు ఘ‌న స్వాగతం ప‌లికేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ నేప‌థ్యంలో అఖిల ప్రియ వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తి.. సుబ్బారెడ్డిపై చేయిచేసుకున్నాడు. దాంతో సుబ్బారెడ్డి ముక్కు నుంచి రక్తం కారింది. దాంతో ఇరు వ‌ర్గాల వారు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అఖిల ప్రియ‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.