Atchannaidu: మేం దోషులం అని తేలితే పీక కోసుకుంటా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తాను కానీ TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కానీ దోషి అని తేలితే తాను పీక కోసుకుంటానని శపథం చేసారు సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు (atchannaidu). ఈ కేసులో తనను చంద్రబాబును రాజకీయ కక్షతోనే ఇరికించారని ఆరోపణలు చేసారు. తనకు కానీ చంద్రబాబుకు కానీ ఒక్క రూపాయి లాభం చేకూరినట్లు తేలినా తాను పీక కోసుకుంటానని అన్నారు. (skill development scam)