ఎవరు రాజీనామా చేయమన్నారు? వాలంటీర్లపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
Atchennaidu: వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వాలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేసి మాకు న్యాయం చేయండి సర్ అని తెలుగు దేశం పార్టీ మంత్రుల వద్దకు వచ్చారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు వద్దకు వెళ్లి సర్ రాజీనామా చేసాం మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అది విని మంత్రులు వారిపై మండిపడ్డారు. మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారో వారిపై కేసు పెట్టి రండి అప్పుడు అలోచిద్దాం. దండం పెట్టి చెప్పా రాజీనామా చేయకండి అని వినలేదు, ఇది రాష్ట్ర పాలసీ. ఏమి చేయలేం అని మంత్రులు వారిపై అసహనం వ్యక్తం చేసారు.