వోడ్కా తాగుతావా.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి
Delhi: ఎన్నికల వేళ కాంగ్రెస్(congress) ముఖ్య నేతలు రాహుల్ గాంధీ(rahul gandhi), ప్రియాంక గాంధీ(priyanka gandhi)లకు కొత్త తలనొప్పి వచ్చింది. అస్సాం(assam) నుంచి కాంగ్రెస్(congress) యూత్ వింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న బీవీ శ్రీనివాస్ అనే వ్యక్తిపై వేధింపుల కేసు నమోదైంది. అస్సాంకు చెందిన అంకిత దత్త అనే యువతి ఈ ఆరోపణలు చేసింది. ఆమె గతంలో అస్సాం తరఫున కాంగ్రెస్ యూత్ వింగ్ చీఫ్‌గా పనిచేసింది. అయితే శ్రీనివాస్ కొన్ని నెలలుగా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది. గతంలో కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
“శ్రీనివాస్ అనే వ్యక్తి నన్ను చాలా హింసిస్తున్నాడు. నా పేరు పెట్టి పిలవకుండా ఏ అమ్మాయ్ అని పిలుస్తాడు. ఛత్తీస్‌గడ్‌లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ యూత్ మీటింగ్ జరుగుతుంటే మరో కాంగ్రెస్ యూత్ లీడర్ నా వద్దకు వచ్చి వోడ్కా తాగుతావా టెకీలా తాగుతావా అని అడిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ విషయం అసలు ఇప్పటివరకు పట్టించుకోలేదు. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ జమ్మూలో ఉన్నారని తెలిసి వెళ్లాను. కాంగ్రెస్ యూత్ వింగ్‌తో నాకు ఉన్న టార్చర్ గురించి చెప్పాను. ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. ప్రియాంక గాంధీ ఎప్పుడూ నేను అమ్మాయిని పోరాడటమూ తెలుసు అని అంటుంటారు. మరి నా విషయంలో ఏమైంది?” అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే అంకిత దత్త అన్నీ అబద్ధాలే ఆడుతున్నారని, ఆమె శ్రీనివాస్‌తో పాటు ఇతర యూత్ లీడర్లను నోటికొచ్చినట్లు వాగుతున్నారని అన్నారు. అబద్ధాలు చెప్పి తన పేరు చెడగొట్టినందుకు పరువునష్టం దావా కూడా వేసామని పేర్కొన్నారు.