BJPకి మరో పదేళ్ల వరకు ముస్లిం ఓట్లు అవసరం లేదు
అస్సాం ముఖ్యమంత్రి, BJP నేత హిమంత బిశ్వ శర్మ (himanta biswa sarma) మరోసారి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసారు. అస్సాంలోని మియా కమ్యూనిటీ (అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను మియా అంటారు) పై ఆయనకు ఎప్పటినుంచో కక్ష ఉంది. కూరగాయల రేట్లు పెరిగినా మరేదైనా సమస్య వచ్చినా దానికి కారణం మియా కమ్యూనిటీనే అని అంటుంటారు హిమంత. ఇప్పుడేమో BJPకి మరో పదేళ్ల పాటు మియా కమ్యూనిటీ ఓట్లు అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికీ మియా కమ్యూనిటీ తనకు, BJPకి సపోర్ట్ చేస్తుందని.. కాకపోతే వారు ఓట్లు వేయకపోయినా ఫర్వాలేదని తెలిపారు.
“” ఎన్నికలు వచ్చినా కూడా నేను మియా కమ్యూనిటీని ఓట్లు వేయమని అడగను. మీయా కమ్యూనిటీ కుటుంబ నియంత్రణ పాలసీని ఫాలో అయ్యి, బాల్య వివాహాలను ఆపేసే మాటైతేనే మాకు ఓటు వేయాలి. లేకపోతే మీ ఓట్లు మాకు అవసరం లేదు. మియాను నివసించే ప్రదేశాల్లో సరైన స్కూల్స్ కూడా లేవు. మా డిమాండ్స్‌కి మియా కమ్యూనిటీ ఒప్పుకుంటేనే వెంటనే వారి పిల్లలకు స్కూల్స్ ఏర్పాటుచేయించే బాధ్యత తీసుకుంటాం. మైనారిటీ విద్యార్థుల కోసం ఏడు కాలేజీలను కట్టించబోతున్నాం “” అని తెలిపారు హిమంత.