Himanta Sarma: మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ‌లు.. ఆర్మీ ఏమీ చేయ‌లేదు

Delhi: కేంద్రం ఆర్మీని దింపితే మ‌ణిపూర్ ఘర్ష‌ణ‌ల‌ను ఒక్క చిటికెలో ఆపేయొచ్చు అని రాహుల్ గాంధీ (rahul gandhi) చేసిన కామెంట్స్‌పై అస్సాం సీఎం హిమంత విశ్వ శ‌ర్మ (himanta sarma) స్పందించారు. ఈ విష‌యంలో ఆర్మీని దింపినా ఏమీ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. (manipur violence) మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ‌లు ఆగాలంటే బుల్లెట్ల‌తో కాకుండా మ‌న‌సుతో ఆలోచించాల‌ని అన్నారు. ఆర్మీని దింపి సొంత దేశ ప్ర‌జ‌ల‌నే ఎలా చంపుకుంటాం అని హిమంత రాహుల్‌ను ప్ర‌శ్నించారు.

“” 1966లో మిజోరాంలో ఇలాంటి ఘ‌ర్ష‌ణ‌లే జ‌రుగుతుంటే అప్ప‌టి ప్ర‌భుత్వం ఐజావ‌ల్‌లో ఎయిర్ ఫోర్స్‌తో బాంబులు వేయించింది. ఘ‌ర్ష‌ణ‌లు అయితే త‌గ్గాయి కానీ మ‌న ప్ర‌జ‌లే క‌దా ప్రాణాలు కోల్పోయింది. మ‌ళ్లీ ఇప్పుడు రాహుల్ అదే చ‌ర్య‌ను చేప‌ట్టాలి అంటున్నారు. మ‌న‌వాళ్లే మ‌నం చంపుకుంటామా? రాహుల్ కూడా ఇదే అంటున్నారు. ఆర్మీని దింపితే తాత్కాలికంగా ఘ‌ర్ష‌ణ‌లు ఆప‌గలుగుతుంది. కానీ పూర్తిగా నిర్మూలించ‌లేదు క‌దా. ఇప్పుడు మ‌నం మ‌ణిపూర్‌లో శాంతిని నెల‌కొల్పాలంటే బుల్లెట్ల‌తో కాదు మ‌న‌సుతో ఆలోచించాలి “” అని హిమంత తెలిపారు. (himanta sarma)