Asaduddin Owaisi: రేవంత్.. నీ సినిమా మొత్తం మా దగ్గర ఉంది

త‌న గురించి త‌న కుటుంబం గురించి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల‌పై మండిప‌డ్డారు AIMIM నేత అస‌దుద్దిన్ ఒవైసీ (asaduddin owaisi). “” అసదుద్దీన్ ఒవైసి కుటుంబం మహారాష్ట్ర నుండి వచ్చింది అంటున్నావ్, నా తాత ముత్తాతలు హిందుస్థాన్‌లో పుట్టారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు లేదా? నువ్వు ఎక్కడ నుండి వచ్చావ్ రాహుల్ గాంధీ? తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు తెలంగాణ కాంగ్రెస్ నాలుక నుండి వచ్చిన మాటలు కావు.. RSS నాలుక నుండి వచ్చిన మాటలు. ముస్లింలు హిందూస్థాన్‌ వాళ్ళు కాదు.. ఇస్లాం బయటి నుండి వచ్చింది అంటున్నాడు.

రేవంత్ రెడ్డి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడం నేను చూసా. గుడిమల్కాపూర్ మార్కెట్ ఆ టైంలో కార్వాన్ మార్కెట్‌గా ఉన్నపుడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డితో కలిసి పనిచేసాడు. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి నీ సినిమా మొత్తం మా దగ్గర ఉంది. నువ్వు ముందు ABVPలో ఉండి అక్కడి నుండి RSSలోకి వెళ్ళావ్. అక్కడి నుండి BJPకి వెళ్ళావ్. RSS వాళ్ళు చంద్రుడు దగ్గరికి వెళ్ళమంటే BJP నుండి చంద్రుడి దగ్గరికి వెళ్ళావ్. చంద్రుడు పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్ళావ్. కాంగ్రెస్ ఇలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని తమ పార్టీలోకి తీసుకుంటుంది “” అని మండిప‌డ్డారు అసదుద్దీన్ ఒవైసీ.