Arvind Kejriwal: బెయిల్ కోసం మామిడి పండ్లు తింటున్న ఢిల్లీ సీఎం

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న తిహార్ జైల్లో ఉన్నారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌కు బెయిల్ రాలేదు. ఎన్నిసార్లు ప్ర‌యత్నించినా కోర్టు బెయిల్‌ను నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆయ‌న కొత్త నాట‌కాన్ని మొద‌లుపెట్టాడ‌ని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

కేజ్రీవాల్‌కు టైప్ 2 డ‌యాబెటిస్ ఉంద‌ని.. షుగ‌ర్ పెరిగి డ‌యాబెటిస్ ఎక్కువైతే అనారోగ్య స‌మ‌స్య అంశంపై బెయిల్ వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో ఆయ‌న కిలోల్లో మామిడి పండ్లు తెప్పించుకుని తింటున్నార‌ట‌. ఇలాగైతే ఆయ‌న‌కు షుగ‌ర్ విప‌రీతంగా పెరిగిపోయి బెయిల్ వ‌స్తుంద‌ని డ్రామా చేస్తున్నార‌ని ఈడీ ఆరోపిస్తోంది.

ALSO READ

Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్.. సీఎంగా వ్వ‌వ‌హ‌రించ‌వ‌చ్చా?