Kejriwal: నేను దొంగైతే భూమ్మీద ఎవరూ నిజాయతీపరులు కారు
Delhi: లిక్కర్ స్కాం(liquor scam) కేసులో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal)కు సీబీఐ నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ(modi) మరీ ఇంత నీచానికి దిగజారతారని అనుకోలేదని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని(aap), నేతలను కావాలనే హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
“గత ఏడాది నుంచి BJP లిక్కర్ స్కాం లిక్కర్ స్కాం అని గొంతుచించుకుంటోంది. ఎవరు అడ్డుగా ఉన్నారనిపిస్తే మోదీ వారిని సీబీఐ చేత నోటీసులు పంపిస్తారు. వారిని టార్చర్ పెడతారు. మొన్న మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేయించారు. నిన్న నాకు నోటీసులు పంపించారు. ఈ దేశంలో బీజేపీని ఎదిరించి ఎక్కడికి వెళ్లిపోగలం? నేను దొంగైతే ఈ భూమ్మీద ఎవ్వరూ నిజాయతీపరులు కారు. నేను మోదీకి 1000 కోట్లు ఇచ్చాను అని చెప్తే ఆయన్ని అరెస్ట్ చేస్తారా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? మనీష్ సిసోదియా నుంచి 14 ఫోన్లు సీజ్ చేసామని ఈడీ కోర్టుకు చెప్పింది. కానీ ఆ నెంబర్లన్నీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఆ 14 ఫోన్లలో 5 ఫోన్లే ఈడీ దగ్గర ఉన్నాయి. కావాలనే మనీష్‌ను టార్గెట్ చేయడానికి కోర్టుకు అబద్ధం చెప్పారు” అని మండిపడ్డారు కేజ్రీవాల్.