Arvind Kejriwal: అర‌వింద్ కేజ్రీవాల్ రాజీనామా

arvind kejriwal resigns

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొన్న బెయిల్‌పై రిలీజ్ అయిన ఆయ‌న ఈరోజు రాజీనామా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. “” రెండు రోజుల త‌ర్వాత నేను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాను. ఢిల్లీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి ఇంకా కొన్ని నెల‌లే ఉన్నాయి. అప్పుడు ప్ర‌జ‌లే తీర్పు ఇస్తారు. నాకు న్యాయ‌స్థానం నుంచి తీర్పు వ‌చ్చింది. ఇక ప్రజ‌ల నుంచి తీర్పు రావాల్సి ఉంది. ప్ర‌జ‌ల తీర్పును బట్టే నేను ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోవాలా వ‌ద్దా అనేది నిర్ణ‌యించుకుంటాను “” అని వెల్ల‌డించారు కేజ్రీవాల్.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అర‌వింద్ కేజ్రీవాల్ హ‌స్తం కూడా ఉంద‌ని ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ అధికారులు ఆయ‌న్ను ఆరు నెలల క్రితం అరెస్ట్ చేసారు. అప్ప‌టి నుంచి కేజ్రీవాల్ బెయిల్ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండాపోయింది. ఆ త‌ర్వాత సీబీఐ అధికారుల ప్ర‌వ‌ర్త‌న పట్ల మొన్న సుప్రీం కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.