arvind kejriwal- రాజకీయాల్లో ఒకప్పుడు ఆణిముత్యం.. నేడు ఆ పేరు ఏమైంది?

delhi: అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) ఒకప్పుడు గొప్ప నాయకుడు.. నిజాయతీ పరుడు.. మొదటిసారి 2011 ఏప్రిల్లో ప్రజా జీవితంలోకి ప్రవేశించి కాంగ్రెస్(congress) ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే(anna hajare) చేపట్టిన ఉద్యమాన్ని విజయవంతంగా ఆయన నడిపించారు. అనంతరం ఈ దేశం అవినీతి కూపంలో కూరుకుపోతోందని.. దాన్నీ ఎలాగైనా తరిమి వేయాలని 2012 నవంబర్లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. సాధారణ రాజకీయ నాయకులను చూసి జనం విసుగుచెందుతున్న తరుణంలో కేజ్రీవాల్‌.. అనతి కాలంలోనే దేశం మొత్తం ఆయన వైపు చూసేలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2013 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయ్యారు. ఢిల్లీ ప్రజలు.. 2015, 2020లో సీఎంగా ఆయనకే పట్టంకట్టారు.

పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుపొంది చారిత్రక విజయం సొంతం చేసుకున్నారు. ఎన్నికల సంఘం కూడా ఆప్‌కు ఇటీవల జాతీయ హోదా కల్పించింది. ఇంత వరకు ఆయన జర్నీ అద్భతంగా సాగింది. నేడు మాత్రం ఆ పరిస్థితులు లేవు. గత ఏడాదిలో ఢిల్లీ లిక్కర్​ స్కాం(delhi liquor scam) వెలుగుచూడటం ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్టు కావడంతో తొలిసారి కేజ్రీవాల్‌ అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు.

ఢిల్లీ లిక్కర్​ స్కాంలో బీజేపీ కావాలనే తనపై బురద చల్లుతోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్‌.. దర్యాప్తు సంస్థలకు వాస్తవాలు చెప్పి నిజాయతీతో బయటకు రావాల్సి ఉంటుంది. అయితే ఈ స్కాంలో ఉన్న మద్యం వ్యాపారుల్లో ఒకరితో ఆయనకు డైరెక్ట్​ పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ స్కాం గురించి కేజ్రీవాల్‌కు తెలిసైనా ఉండాలి.. లేదా ఎంతోకొంత డబ్బులు అయినా ఆయన తీసుకుని ఉండాలి. మరి కోర్టు దృష్టితో చూస్తే ఈ రెండూ తప్పే కదా. లిక్కర్‌ స్కాంతో కేజ్రీవాల్‌కు ఉన్న మంచిపేరుపోయి.. అవినీతి మరక అంటిందని ఇప్పుడే చెప్పకపోయినా.. ఎంతోకొంత ఆయన పాత్ర ఉందని మాత్రం ఈడీ, సీబీఐ విచారణల్లో నిందితులు చెబుతున్నారు.