Kejriwal: సినిమా వాళ్ల‌కు ఓటేస్తే అంతే..!

Arvind kejriwal: సినిమా వాళ్లు పెద్ద స్టార్స్ అని వారికి ఓటేస్తే బతుకులు మార‌తాయి అనుకుని వారిని ఎన్నుకుని ప్ర‌జ‌లు మోస‌పోతున్నార‌ని అన్నారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. పంజాబ్‌లో 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అంతా స‌న్నీ డియోల్‌కి (sunny deol) ఓటేసి గెలిపించార‌ని.. కానీ ఆయ‌న గెలిచాక ఒక్క‌సారి కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు. అందుకే సినిమా వాళ్ల‌కు కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి (aap) ఓటేస్తే ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరుతాయ‌ని తెలిపారు. సినిమా పెద్ద‌లు సినిమాల్లోనే హీరోల్లా క‌నిపిస్తార‌ని నిజ జీవితంలో వారు ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోర‌ని పేర్కొన్నారు.