Revanth Reddy KCR చెప్పిన‌ట్లే ఆడుతున్నాడు

Hyderabad: TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy).. తెలంగాణ సీఎం KCR చెప్పిన‌ట్లే ఆడుతున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు నిజామాబాద్ BJP ఎంపీ అర‌వింద్ ధ‌ర్మ‌పురి (arvind dharmapuri). కాంగ్రెస్ (congress) పార్టీని, రేవంత్ రెడ్డిని హైలైట్ చేయాల‌ని మీడియా సంస్థలకు KCR డ‌బ్బులు పంపుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేసారు. KCR అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ రావ‌డంతో వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పార‌ట‌. KCR చెప్పినట్లు రేవంత్ రెడ్డి (revanth reddy) ఆడుతున్నాడని అర‌వింద్ షాకింగ్ కామెంట్స్ చేసారు.