Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిపై అరెస్ట్ వారెంట్
Sheikh Hasina: ఇండియాలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (ఆమె ఇంకా రాజీనామా చేయలేదు)పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యూనల్ (ICT) ఈ వారెంట్‌ను జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో జులై నుంచి ఆగస్ట్ మధ్యలో జరిగిన విద్యార్థుల అల్లర్ల సంఘటనల్లో భారీగా హత్యలు జరిగాయి. దీనిపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తున్నట్లు ట్రిబ్యూనల్ ప్రకటించింది. నవంబర్ 18న ఆమెను న్యాయస్థానంలో హాజరుపరచాలని ట్రిబ్యూనల్ చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తజుల్ ఇస్లాం తెలిపారు. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం షేక్ హసీనా ఢిల్లీలోని స్టార్ హోటల్‌లో ఉంటున్నారు. ఆమెకు కేంద్రం భారీ భద్రతను ఏర్పాటుచేసింది.