Arikepudi Gandhi: దమ్ముంటే రారా బ్రోకర్ నా కొడకా.. కేసీఆర్‌ను నాశనం చేసింది నువ్వేరా
Arikepudi Gandhi: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధి. గాంధిని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేతకు పీఏసీ పదవిని ఇవ్వాలి కానీ పార్టీ జంప్ అయిన వారికి ఎలా ఇస్తారు అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటిపై భారత రాష్ట్ర సమితి జెండాను ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేసారు.
దీనిపై గాంధీ స్పందించారు. “” అరేయ్ కౌశిక్ రెడ్డి… చూసుకుందాం రారా బ్రోకర్ నా కొడకా. ఈరోజు 11 గంటలకల్లా నా ఇంటిపైన జెండా ఎగరేస్తానన్నావ్. దమ్ముంటే రా రా. నువ్వు రాకపోతే12 గంటలకల్లా మేము నీ ఇంటికి వస్తాము. నా యుద్ధం BRSతో కాదు. కౌశిక్ రెడ్డితో. దమ్ముంటే రారా నా కొడకా. బీఆర్ఎస్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాశనం చేసిందే నువ్వు రా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను BRSలో చేర్పించేదే నువ్వు రా నా కొడకా “” అంటూ వీడియోను రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా అరికెపూడి గాంధీ ఇంటి ముందు మోహరించారు.