Arvind Kejriwal: ఇప్పుడు తిట్టుకోవడం వల్ల లాభం లేదు
Delhi: కుండపోత వర్షాలు, వరదల వల్ల దేశ రాజధాని దిల్లీ (delhi) అతలాకుతలం అయిపోయింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యమునా నది డేంజర్ లెవల్‌లో ఉన్న నేపథ్యంలో అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. దిల్లీలో పరిస్థితి గురించి సోషల్ మీడియాలో తన ఫొటోలు పెట్టి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇదే అనువైన సమయం అన్నట్లు వేలెత్తి చూపుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరిని ఒకరు నిందించుకుంటే కలిగే లాభం ఏమీ లేదన్నారు.
ఈ సమయంలోనే ఒక మనిషి మరో మనిషికి సాయం చేసుకోవాలని అన్నారు. నిన్నటి నుంచి BJP తన గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని దాని బదులు సాయం చేస్తే బాగుంటుందని తెలిపారు. ఎవరు ఎన్ని తిట్టుకున్నా తనకు ఏమాత్రం ఫరక్ పడదని, దిల్లీ ప్రజల రక్షణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈరోజు, రేపు కూడా దిల్లీలో కుండపోత వర్గాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.