ఏపీకి కొత్త సీఎస్.. జ‌వ‌హ‌ర్ రెడ్డికి రాం రాం

ap to get new cs

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్ర‌టరీ (CS) నియ‌మితులు కాబోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌గా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డి మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్లే న‌డుచుకుని త‌ప్పు జ‌రుగుతున్నా కూడా అస‌లు ప‌ట్టించుకోకుండా త‌న‌కు ఏమీ తెలీన‌ట్లు ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసార‌ట‌. కాబ‌ట్టి.. ఇప్పుడు జ‌వ‌హ‌ర్ రెడ్డికి రాం రాం చెప్పి కొత్త సీఎస్‌ను నియ‌మించాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ నేప‌థ్యంలో జ‌వహ‌ర్ రెడ్డిని సెల‌వుపై పంపించేందుకు యోచ‌న చేస్తున్నారు.