Pawan Kalyan: విమాన టేకాఫ్‌కి నో ప‌ర్మిష‌న్

జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ప్రత్యేక విమానం టేకాఫ్ కాకుండా పోలీసులు బేగంపేట విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆయ‌న బేగంపేట్ విమానాశ్ర‌యం నుంచి బయలుదేరడానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు. ఆయన ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానాన్ని టేకాఫ్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిమిత్తం శనివారం విజయవాడకు బయలుదేరిన జనసేన అధ్యక్షులు పవన్ క‌ళ్యాణ్‌ని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. (chandrababu naidu arrest)