AP High Court: YSRCP నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఆగ్రహం
AP High Court: వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాల కూల్చివేతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మండిపడింది. తక్షిణమే కూల్చివేతలను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. 10 జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలపై పార్టీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేసారు. అక్రమంగా తమ కార్యాలయాలను కూల్చివేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌పై రేపటి వరకు కోర్టు స్టేటస్ కో విధించింది. ఈ కేసుకు సంబంధించిన మళ్లీ రేపు విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.