Jagan: జ‌గ‌న్‌కు షాక్.. బెయిల్ ఇవ్వ‌లేమ‌న్న హైకోర్టు

ap high court big shock to jagan

Jagan: ఆంధ్రప్ర‌దేశ్ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు షాకిచ్చింది. నేతల బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిర‌స్క‌రించింది. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీమంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్, తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో.. తలశిల రఘురాం, అప్పిరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్, సహా ఇతర వైఎస్సార్ కాంగ్రెస్ నేతల పిటిషన్లు రిజెక్ట్ చేసింది.

అయితే కోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల త‌ర‌ఫు న్యాయ‌వాది మాట్లాడుతూ.. ఆనాడు మంత్రి జోగి ర‌మేష్ కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివ‌సానికి వెళ్లార‌ని అంతేకానీ గొడ‌వ చేయ‌డానికి కాద‌ని చెప్తూ అప్ప‌టి వీడియోల‌ను సాక్ష్యాల‌ను చూపిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. దీనికి ప్ర‌తివాద‌న‌గా చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫున న్యాయ‌వాది సిద్ధార్థ్ లుత్రా మాట్లాడుతూ.. అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయ‌డ‌మో లేదా.. ఒక కారులో మర్యాద‌పూర్వ‌కంగా వెళ్ల‌గ‌మో చేయాలి కానీ.. నీ ఇంటికి వ‌స్తున్నా నీ అంతు చూస్తా అంటూ అన్ని కార్ల‌ల్లో ర్యాలీగా వెళ్లడం ఏంటి అని అన్నారు. వాదోప‌వాదాలు విన్న న్యాయ‌మూర్తి ముంద‌స్తు బెయిల్‌ను నిరాక‌రిస్తున్న‌ట్లు తీర్పు వెల్ల‌డించారు.