Jagan: విద్యార్థులపై ఫోకస్‌.. బడికి రాకుంటే అంతే!

Amaravathi: ప్రభుత్వ పాఠశాలల్లో(government schools) అభివృద్ది పనులతోపాటు, అక్కడ అందే విద్య కూడా నాణ్యతగా ఉండాలని సీఎం జగన్‌(Ap cm jagan) భావిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యాశాఖ మంత్రి, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి రోజూ బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడికి రాని పిల్లలు ఎవరైనా ఉంటే.. అదే రోజు తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక ఇప్పటికే అమ్మఒడి(ammavadi) పథకం రావాలంటే.. విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.  విద్యార్థులకు మూడు దశల్లో టోఫెల్‌(toffel exams) పరీక్షలు నిర్వహించాలని.. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్ష నిర్వహించాలని జగన్‌ తెలిపారు. జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాల పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఈ– కంటెంట్‌(e-content) రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఇక వివిధ సబ్జెక్ట్ లను బోధించే ఉపాధ్యాయులకు ఐఐటీ మద్రాస్(iit madras) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేసి బోధనలో నూతనత్వం తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలని.. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. 6 నుంచి 10వ తరగతి చదివే వారికి జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలని సీఎం తెలిపారు. మూడేళ్లుగా సీఎం జగన్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నా.. ఇప్పటి వరకు అమలు కాలేదు. ప్రస్తుతం విద్యార్థుల చేతికి ట్యాబులు వచ్చిన నేపథ్యంలో ఏ విద్యా సంవత్సరం నుంచైనా నిర్వహిస్తారో లేదు చూడాలి. టోఫెల్‌ పరీక్షలు అనేవి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నిర్వహిస్తారు. ఇక పాఠశాల స్థాయి నుంచి ఈ పరీక్షలపై అవగాహన ఉంటే.. భవిష్యత్తులో వారు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు సులువుగా ఉంటుంది.