Jagan: పవన్ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు

AP: పవన్ కళ్యాణ్ (pawan kalyan) అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan). పవన్ కళ్యాణ్ అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేస్తాడ‌ని పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడ‌ని అస‌భ్య‌క‌రంగా మాట్లాడారు. ఏపీ వాలంటీర్లపై జ‌న‌సేనాని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ (jagan) అలా మాట్లాడారు. ఏపీ వాలంటీర్లు (ap volunteers) సేక‌రిస్తున్న డేటా వ‌ల్ల ఏపీ నుంచి 28 వేల మంది మ‌హిళ‌లు మిస్స‌య్యార‌ని వారిలో 9 వేల మంది మాత్ర‌మే ట్రేస్ అయ్యార‌ని ప‌వ‌న్ ఆరోపించారు.

దీనిపై జ‌గ‌న్ స్పందిస్తూ.. “” అక్ర‌మ సంబంధాలు పెట్టుకునే ద‌త్త‌పుత్రుడు వాలంటీర్ల వ్య‌వ‌స్థ గురించి చెప్తుంటే న‌వ్వొస్తోంది. లోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని బాలకృష్ణ అంటాడు. చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి కానీ సిగ్గు లేదు. బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశాను అంటాడు“” అంటూ TDP, జ‌న‌సేన (janasena) పార్టీల‌పై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసారు జ‌గన్.