Jagan: గోవిందా.. ఏందయ్యా ఇది?
Jagan: ఇంత ప్రచార పైత్యం అవసరమా? కలియుగ వైకుంఠనాధుడి క్షేత్రంలోనూ స్వీయస్తుతా? కోట్ల రూపాయిల ప్రజాధనంతో వందలాదిగా ఉన్న సలహదార్లు ఏం చేస్తున్నట్టు? ఒక్కరూ వారించలేరా? వద్దని చెప్పలేరా? వెనక్కు తీసుకోమని కోరలేరా? భక్తుల మనోభావాల గురించి పట్టింపు లేదా? వెంకటేశా.. నిన్ను నువ్వు కాపాడుకో అంటూ భక్తుల వేడుకోలు.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి తిరుమల కొండపై శ్రీవారి సమానుడిలా ప్రచారం చేస్తున్నారు కార్యకర్తలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్‌పై జగన్ ఫోటోను ప్రచురించారు. అప్లికేషన్ ఫాంలో ఎడమ వైపు శ్రీవారి ఫోటోను ముద్రించగా.. కుడివైపు జగన్ ఫోటో ఉండటంతో భక్తులు కంగుతిన్నారు.
ఇది కచ్చితంగా YSRCP భజన బ్యాచ్ పనే అయివుంటుంది. ఎందుకంటే జగన్ ఇలాంటివి చెప్పి మరీ చేయించుకునే వ్యక్తి కాదు. ఆయన ఏపీకి మంచి చేసారో లేదో పక్కన పెడితే.. మరీ ఇలా పిచ్చి పీక్స్‌కి వెళ్లే పనులు స్వయంగా చెప్పి మరీ చేయించుకోరు. ఇలాంటివి చేస్తే ఆయనకే బ్యాక్ ఫైర్ అవుతుందని జగన్‌కు తెలుసు.