Jagan: నీ ఆశయాలే నన్ను నడిపిస్తున్నాయి నాన్నా..!
నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajasekhar reddy) వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసారు ఏపీ సీఎం జగన్ (jagan). “” నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా“” అంటూ తండ్రిని గుర్తుచేసుకున్నారు జగన్. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించనున్నారు. (jagan)