AP CID: చంద్రబాబు విచారణకు సహకరించలేదు

శ‌ని, ఆదివారాల్లో జ‌రిగిన AP CID విచార‌ణ‌లో చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అస‌లు త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టారు CID స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్. కానీ చంద్ర‌బాబు మాత్రం తాను విచార‌ణ‌కు స‌హ‌క‌రించాన‌ని నిన్న AP ACB కోర్టుకు వెల్ల‌డించారు. అంతేకాదు.. విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో CID అధికారులు ఏం ప్ర‌శ్న‌లు అడ‌గాలో తెలీక త‌మ ద‌గ్గ‌ర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ తెగ వెతికేసార‌ని కూడా చెప్పారు. ప్ర‌శ్న‌లు రెడీగా లేవంటే కేసు కూడా బూట‌క‌మే అని అభిప్రాయ‌ప‌డ్డారు.