AP CID: ప్రజలు, మీడియా మాకే సపోర్ట్ చేయండి
ఒక కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆ కేసు ఏ రాష్ట్రంలో జరుగుతోందో అక్కడే ప్రెస్ మీట్లు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ AP CID మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కాం (skill development scam) జరిగిందంటూ TDP అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన AP CID .. ఇప్పటికే ఏపీలో, తెలంగాణలో రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టింది. కేసుకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ కూడా ప్రెస్ మీట్ నిర్వహించింది. ADG ఎన్ సంజయ్‌తో పాటు AAG సుధాకర్ రెడ్డిలు ఈ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
అసలు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి ఢిల్లీకి ఏం సంబంధం? ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు అని AP CID చెప్తోంది. ఆధారాలు కూడా ఉన్నాయంటోంది. మరి చంద్రబాబుకి ఢిల్లీకి సంబంధం ఏంటి? ఎందుకు వీరు అక్కడికి వెళ్లి ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. పైగా సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “” TDP వారంతా తప్పు మాదే అంటున్నారు. దయచేసి వారి మాటలు నమ్మకండి. మేం చెప్పేదే నమ్మండి. మీ సపోర్ట్ మాకే ఉండాలి “” అని అడుక్కుంటున్నారు. ఇదేం లెక్క? TDP, YSRCP నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ AP CID ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్‌మీట్లు ఎందుకు నిర్వహిస్తోందో వారే చెప్పాలి.
అంటే ఎక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఢిల్లీకి వెళ్లి TDP, జనసేన (janasena), BJP పొత్తు గురించి మాట్లాడతారోనని ఏపీ అధికార ప్రభుత్వం ముందే ఇలా ప్రెస్‌మీట్లు పెట్టించి ప్లాన్లు వేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు చరిత్రలో ఒక రాష్ట్రానికి చెందిన దర్యాప్తు సంస్థ ఆ రాష్ట్రానికి చెందిన కేసును పక్క రాష్ట్రంలోకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన దాఖలాలు లేవు. పైగా మాకే సపోర్ట్ చేయండి అని సుధాకర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్న తీరు చూస్తుంటే నిజంగానే అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడుని ఇరికించారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.