AP CID: చంద్రబాబుకి పదేళ్లు శిక్ష పడొచ్చు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకి కోర్టులో దోషి అని తేలితే దగ్గరగా పదేళ్లు శిక్ష పడొచ్చని అన్నారు సీఐడీ అడిషనల్ డీజీ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. (ap cid). రూ.371 కోట్లు ప్రభుత్వ GO ద్వారా విడుదల చేసారు. ఈ రూ.371 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3300 కోట్లలో పదో శాతం అని పరిగణిస్తూ.. ఆ సొమ్మును డిజైన్ టెక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడి నుంచి PVSP, ఎషియన్ అనే షెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేసారు. వీరి నుంచి మరిన్ని షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయింది. ఇక ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా జులై 14, 2014 సమయంలో సీమెన్స్ కంపెనీతో ఓ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని ఆర్గనైజ్ చేసింది డిజైన్ టెక్ కంపెనీ. దీనిని ఆచరణలోకి తీసుకురావడానికి అదే సంవత్సరం సెప్టెంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్‌ని ఒప్పందాన్ని సైన్ చేసినప్పుడు అసలు ఈ కార్పొరేషన్ లేదు. సెప్టెంబర్ నాటికి స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటుచేసారు. ఆ సమయంలో క్యాబినెట్ అప్రూవల్ జరగలేదు. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయడం నేరం అని సీఐడీ అడిషనల్ డీజీ తెలిపారు. ఈ కుట్రలో చంద్రబాబే ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. (ap cid)