Ayyannapatrudu: నన్ను రేప్ చేస్తారా అంటోంది.. రోజాపై స్పీకర్ కామెంట్స్
Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజాపై కామెంట్స్ చేసారు. అసలు ఆమె గురించి ఆమె సినిమాల గురించి తనకేమీ తెలీదని.. మీడియా ముందు నోటికొచ్చినట్లు వాగుతున్నప్పుడే ఆమె గురించి తనకు తెలిసిందని అన్నారు. సనాతన ధర్మంలో మగవారు ఆడవారిని ఆడవారు మగవారిని పరస్పరం గౌరవించుకోవాలని.. కానీ రోజాను చూస్తే అసలు గౌరవం అనే మాట కూడా గుర్తుకు రాదని అన్నారు. నన్ను రేప్ చేస్తారా? నన్ను రేప్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? అని మీడియా ముందు అసభ్యకరంగా మగవారిని రేయ్ రేయ్ అని పిలిచే ఆమెను ఎవరు గౌరవిస్తారని మండిపడ్డారు.