నాయకుల బూతు పురాణం..ట్రెండింగ్‌లో ‘బుజ్జినాన్న’!
Hyderabad: ఏపీ(andhra pradesh), తెలంగాణ(telangana) రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దారుణంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఏపీలో అయితే ఓట్లు వేసిన ప్రజల్ని తిడుతున్నారు. అవి కాస్త.. కొన్నిచోట్ల దాడులకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు.. ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్బంగా యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. యువకులకు ఏం చేయనున్నారో ప్రకటించారు. ఈ అంశంపై BRS మంత్రి .. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. TPCC చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. యూత్ డిక్లరేషన్ గురించి పొట్టోడు మాట్లాడటం ఏంటి. నా కొడుకు, వాడి అనే పదాలను తలసాని సంభోదించారు. ఇక తలసాని వ్యాఖ్యలపై రేవంగ్ తీవ్ర విమర్శలు చేశారు. తలసాని పెండ పిసికేవాడని, గతంలో దున్నపోతులను కాశాడని ఆరోపణలు చేశాడు. పిసుకుడు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పాన్‌పరాగ్ వేసుకునే తలసాని.. తన గురించి మాట్లాడటం ఏంటని రేవంత్ ఫైర్ అయ్యారు.
ఏపీలో ఇలా…
AP రాజకీయాలు తొలి నుంచి వాడీవేడిగా సాగుతున్నాయి. YCP, TDP జనసేన నాయకుల మధ్య మాటల యుద్దం మొదటి నుంచి సాగుతూనే ఉంది. ఇక తాజాగా YCP మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతుల సమస్యలు తెలుసుకుంటున్న తరుణంలో సంయమనం కోల్పోయారు. ఓ రైతు మంత్రిని ప్రశ్నించగా.. ‘నీకెంటి చెప్పేది ఎర్రిపప్ప’ అని బూతులు తిట్టారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కారుమూరి తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ… ఎర్రిపప్ప అంటే.. తన ప్రాంతంలో బుజ్జినాన్న అని చెప్పి.. ట్రోల్ అయ్యారు. టీడీపీ, జనసేన నాయకులు సైతం గతంలో చెప్పుతో కొడతా.. అంటూ వైసీపీ వారిని తిట్టిన సందర్బాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్తలో గౌరవప్రదమైన పదవిలో ఉన్నవారు.. ఇలాంటి భాషను ఉపయోగించడం వల్ల వారు చులకన అవుతున్నారని గ్రహించలేకపోతున్నారు.