AP ACB Court: CIDకి 3 కండీషన్లు..!
CIDకి రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) కస్టడీకి ఇవ్వనున్నట్లు AP ACB కోర్టు వెల్లడించింది. అయితే విచారణను వీడియో రికార్డింగ్ ద్వారా చేయాలని.. కానీ విచారణకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
కన్నీటి పర్యంతమైన చంద్రబాబు
నన్ను అకారణంగా జైల్లో పెట్టారు. నా బాధ, ఆవేదనంతా అదే. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు అంటూ జడ్జికి చంద్రబాబు మొరపెట్టుకున్నారు. ఈ రోజు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చంద్రబాబును జడ్జి ముందు CID ప్రవేశపెట్టింది. ఆ సమయంలో చంద్రబాబు తన బాధని వెళ్లగక్కారు. దాదాపూ కన్నీటి పర్యంతమైన బాబు ఆవేదనతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని చట్టం అందరికీ సమానమని జడ్జి అన్నారు. “” మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. అంతేకానీ రిమాండ్‌ను శిక్షగా భావించొద్దు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం “” అని జడ్జి చంద్రబాబుకి చెప్పారు. (ap acb court)
CIDకి ACB కోర్టు 3 కండీషన్లు
చంద్రబాబు నాయుడును CID కస్టడీకి ఇవ్వగా రేపు, ఎల్లుండి విచారణకు ACB కోర్టు అనుమతిచ్చింది. ఆయన్ను జైల్లోనే విచారిస్తామని అధికారులు తెలపడంతో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటలవరకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు మూడు కండీషన్లను విధించింది.
1. సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలి
2. ఏ అధికారులు విచారించనున్నారో వారి వివరాలు ఇవ్వాలి
3. వీడియోలు, ఫొటోలు బయటకి రాకూడదు.