ACB Court: CID త‌ర‌పు లాయ‌ర్‌పై న్యాయ‌మూర్తి సీరియ‌స్

AP CID త‌ర‌ఫు లాయ‌ర్ జ్యోతిపై AP ACB కోర్టు (acb court) న్యాయ‌మూర్తి సీరియ‌స్ అయ్యారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంకు సంబంధించి చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) మ‌రో మూడు రోజుల పాటు క‌స్ట‌డీ ఇవ్వాల‌ని కోరుతూ కోర్టులో పిటిష‌న్ వేసారు. పిటిష‌న్‌ను పరిశీలించిన న్యాయ‌మూర్తి అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. ఎందుకంటే.. ఆ పిటిష‌న్‌లో పేర్కొన్న రెండు పేరాల‌ను సోష‌ల్ మీడియాలో వచ్చిన వార్త‌ల‌ను బ‌ట్టి రాసిన‌వ‌ట‌. దాంతో ఆమెకు ఒళ్లుమండిపోయింది. ఈ చెత్త‌ను రాసి కోర్టుని అవ‌మానించార‌ని వాటిని తొల‌గించి నీట్‌గా మ‌రో పిటిషన్ వేస్తేనే దానిని ప‌రిశీలిస్తాన‌ని ఆదేశించారు.