Chandrababu Naidu: 2 రోజులు CID కస్టడీ
TDP అధినేత చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) కస్టడీకి ఇవ్వాలని AP CID వేసిన పిటిషన్‌పై AP ACB కోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబుని రెండు రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో (skill development) ఇంకా విచారణ చేయాల్సి ఉందని అప్పుడే మరిన్ని వివరాలు బయటికి వస్తాయని CID ACB కోర్టుకు తెలిపింది. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ విచారణ ఎక్కడ చేస్తారు అని అడిగింది. జైల్లోనే విచారిస్తారా.. లేక ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకున్నారా అని న్యాయమూర్తి CIDని ప్రశ్నించింది. CID చెప్పే దానిని బట్టి వివరణ ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.