Chandrababu పై ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్

ACB కోర్టులో TDP అధినేత‌ చంద్రబాబు నాయుడుపై (chandrababu) ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖ‌లు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ జారీ చేసి చంద్రబాబును విచారించాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ఆల్రెడీ చంద్ర‌బాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఈరోజు ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది సిద్ధార్థ్ లుత్రా బెయిల్ పిటిషన్ దాఖ‌లు చేయాల‌ని చూస్తున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రో పిటిషన్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. (chandrababu naidu arrest)