Anil Kumar Yadav: ABN TV5 ఛానెళ్లు మాకు మంచే చేసాయి

Anil Kumar Yadav thanks to tv5 abn mahaa news channels

“” నేను మూడు నెల‌లు క‌నిపించ‌క‌పోయేస‌రికి జ‌గ‌న్‌కు అనిల్ వెన్నుపోటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనిల్ గుడ్ బై అంటూ ఏబీఎన్, టీవీ5, మ‌హా న్యూస్ ఛానెళ్లు తెగ ఊద‌ర‌గొట్టాయి. వారికి ధ‌న్య‌వాదాలు చెప్పాల‌నుకుంటున్నాను. ఎందుకంటే.. దివంగ‌త నేత వివేకానంద రెడ్డి ఒక మాట అంటుండేవారు. మంచైనా చెడైనా వార్త‌ల్లో నిలుస్తుండాలి అని. కాబ‌ట్టి ఆ మూడు ఛానెళ్ల వ‌ల్ల మాకు మంచే జ‌రిగింది. ఈరోజు చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చాడు క‌దా అని రెడ్ బుక్ గ్రీన్ బుక్ అంటున్నారు. మీకు బుక్స్ కావాలేమో మా బుర్ర‌లు కంప్యూట‌ర్ చిప్స్ లాంటివి. అన్నీ గుర్తుంటాయి మేం అధికారంలోకి వ‌చ్చాక చెప్తాం. ఒక‌ప్పుడు డీఎంకే పార్టీకి కూడా 2 సీట్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో మెజారిటీ ఓట్ల‌తో గెలిచింది. ఇప్పుడు మేమూ అంతే. ఈసారి మంచో చెడో ప్ర‌జ‌లు కూట‌మికి ఓట్లేసారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాదు.. ఇక రాబోయే ప్ర‌తి ఎన్నిక‌ల్లో గెలుపు మాదే. కార్పొరేట‌ర్లు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. నిజానికి ఓడిపోయిందే కార్పొరేట‌ర్ల వ‌ల్ల‌. రేపు మ‌ళ్లీ మ‌రో 50 కార్పొరేట‌ర్ పోస్టులు భ‌ర్తీ అవుతాయి. మ‌ళ్లీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. జ‌గ‌న్ అన్న‌ను సీఎం చేసేందుకు క‌సితో పోరాడ‌తాం “” అని వెల్ల‌డించారు.