Anil Kumar Yadav: పవన్ ఇప్పుడు గెలిస్తే ఏంటి.. రేపనేది ఉంటుందిగా..
Anil Kumar Yadav: అధికారంలో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని.. ఆయన గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మాట మార్చారు. పవన్ కళ్యాణ్‌ను గేటు దాటనివ్వను అని తాను ఎప్పుడూ అనలేదని తెలిపారు. 40 శాతం మంది ప్రజలు తమ వైపే ఉన్నారని.. పవన్ ఈరోజు గెలిచినా రేపు అనేది ఉంటుందని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులే అవుతోంది కాబట్టి ఇంకో రెండు మూడు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అప్పుడు తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరించారు. తనకు ప్రతిపక్షంలో ఉండటం కొత్తేమీ కాదని.. కేవలం ఐదేళ్లు మాత్రమే తాను అధికారంలో ఉన్నానని.. ఈ ఐదేళ్లలో చివరి రెండేళ్లు తనను కొందరు ఇబ్బందులకు గురిచేసారని తెలిపారు.