Budget 2024: ఆంధ్రకు నో ప్రత్యేక హోదా.. బిహార్‌తో పాటు కేవలం ఆర్థిక సాయం
Budget 2024: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఎన్డీయే కూటమితో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోదీతో ఇప్పటివరకు ప్రస్తావించలేదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క కేంద్రంలో కూటమిలో భాగమైన జేడీయూ అధినేత నితీష్ కుమార్.. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరినప్పటికీ.. మోదీ అందుకు ఒప్పుకోలేదు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ బిహార్‌కు కానీ ఆంధ్రప్రదేశ్‌కు కానీ ప్రత్యేక హోదా మాట అనేది లేదు. కానీ.. బిహార్‌కు ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సాయం చేస్తామని మాత్రం ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించనున్నారు. బీహార్‌లో జాతీయ రహదారులకు రూ.20 వేల కోట్లు.. వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11 వేల కోట్లు కేటాయించనున్నారు. బహుపాక్షిక అభివృద్ది ఏజెన్సీల నిధుల ద్వారా బీహార్‌కు ఆర్ధిక సాయం అందనుంది.