Anam Venkata Ramana Reddy: రోజా డ్రెస్‌పై ఆనం కామెంట్

Anam Venkataramana Reddy comments on rk roja picture

Anam Venkata Ramana Reddy:  తెలుగు దేశం పార్టీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజాపై ఎప్పుడూ ఏదో ఒక సెటైర్ వేస్తుంటారు. ప్రెస్‌మీట్లు పెట్టి అంద‌రి ముందు రోజాను ఏమ్మే.. ఏందే.. అని మాట్లాడుతుంటారు. ఆడ‌వాళ్ల‌ను ప‌ట్టుకుని అలా మాట్లాడ‌కూడ‌ద‌ని కానీ ఆడ‌వాళ్ల‌ను చూస్తే చేతులెత్తి దండం పెట్టేలా ఉండాలి కానీ రోజా మాదిరి మాత్రం ఉండ‌కూడ‌ద‌ని అంటుంటారు.

అయితే.. ఈరోజు ఆనం రోజా వేసుకున్న దుస్తుల‌పై కామెంట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక రోజా అమెరికాలో ఉంటున్న త‌న కూతురి వ‌ద్దకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో రోజా త‌న కుమార్తెతో క‌లిసి షాపింగ్‌కి వెళ్లారు. ఆ స‌మ‌యంలో రోజా కాళ్లు క‌నిపించేలా గౌను వేసుకున్నారు. ఆ ఫోటో ఆనంకు దొర‌క‌డంతో ఆయ‌న వెంట‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ… అక్కా సూప‌ర్ అని కామెంట్ చేసారు. ఆయ‌న పెట్టిన పోస్ట్‌కు చాలా మంది స‌పోర్ట్ చేస్తూ స‌ర‌దాగా కామెంట్స్ చేయ‌డం కొస‌మెరుపు.