Anam Venkata Ramana Reddy: విజయసాయి రెడ్డి పూజకు పనికిరాని పువ్వు.. ఆయన ఎలా గర్భవతిని చేస్తాడు?
Anam Venkata Ramana Reddy: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన కలింగిరి శాంతికుమారి విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయి రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డి. తనకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డి పూజకు పనికిరాని పువ్వని.. అతని కూతురు కూడా అతనికి పుట్టింది కాదని అన్నారు. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచకున్నాడని.. అతను ఎలా గర్భవతిని చేస్తాడని ఆనం అన్నారు.
అసలు విజయ సాయిరెడ్డి ఆడవాళ్ల వెంట పడటమేంటో తనకు అర్థంకావడంలేదని సెటైర్లు వేసారు. శాంతికుమారి భర్త మదన్ మోహన్ అంతేసి ఆరోపణలు చేస్తుంటే మగాడిలా ముందుకొచ్చి డీఎన్ఏ పరీక్షకు సిద్ధం అని చెప్పాలి కానీ చంపేస్తే ఏసేస్తా చూసుకుందాం అని అంటే అందరూ ఆ ఆరోపణలు నిజం కాబట్టే తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడని అనుకుంటారని ఆనం అన్నారు. ఓసారి విజయ సాయిరెడ్డి ఎవరితోనో కొలంబియా వెళ్లాడని ఆరోపణలు వస్తున్నాయని.. ఆ కొలంబియాకు ఎవరితో వెళ్లారో అన్ని విషయాలు బయటికి రావాల్సిందే అని డిమాండ్ చేసారు.