Amul vs Nandini: BJPకి త‌ల‌నొప్పిగా మారిన పాల సెంటిమెంట్

Bengaluru- దక్షిణాది రాష్ట్రాల్లో(south states) ప్రాంతీయ భావం, భాషాభిమానం ఎక్కువగా చూస్తుంటాం. ఇక ఇదే సెంటిమెంట్‌ను నమ్ముకుని స్థానిక పార్టీలు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. కానీ ఒక్క కర్నాటక(karnataka)లో మాత్రం దీనికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌(congress), బీజేపీ(bjp)లు అధికారంలోకి వస్తున్నాయి. సహజంగా రాజకీయాల్లో సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవడంలో బీజేపీది అందెవేసిన చేయి అంటుంటారు. ఇప్పుడు కర్నాటకలోనూ అదే జరుగుతోంది. కానీ అన్ని సందర్భాలు మనకు అనుకూలం కాదు అన్నట్లు.. ఇప్పుడు అదే సెంట్‌మెంట్‌ బీజేపీకి సవాలుగా మారుతోంది. ప్రస్తుతం కర్నాటకలో అమూల్‌(amul) వర్సెస్‌ నందిని(nandini) అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ముస్లింల రిజర్వేషన్లు తొలగించి హిందువుల ఓట్లను పొంది రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావాలని చూస్తోంది. ఈక్రమంలోనే అమూల్‌ వివాదం రావడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా తయారైంది.

కర్నాటక, తమిళనాడు(tamilnadu)లో పెరుగు పేరును హిందీలో మార్చాలనే వివాదం ముగియకముందే.. అమూల్‌ రూపంలో ఇంకో వివాదం వచ్చిపడింది. గుజరాత్‌(gujarath)కు చెందిన అమూల్‌ సంస్థ కర్నాటకలో ఎంట్రీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కర్నాటకాకు సొంత మిల్క్‌ బ్రాండ్‌ అయిన నందినిని ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే గతంలో అమూల్‌లో నందినీని విలీనం చేయాలని బీజేపీ ప్రయత్నించి విఫలమైంది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ అవ్వడానికి అమూల్‌ ప్రయత్నిస్తోంది. దీంతో కర్నాటకలోని కాంగ్రెస్‌, జేడీఎస్‌(jds) పార్టీలు భగ్గుమన్నాయి. నందినీని మూసివేసే దిశగా అమూల్‌ చర్యలు చేపట్టిందని వారు ఆరోపిస్తున్నారు. కర్నాటక రైతులను తొక్కేసి.. గుజరాత్‌ రైతులను ప్రోత్సహించే పనిలో మోదీ, అమిత్‌షా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల్లోకి ఇదే విషయాన్ని తీసుకెళ్తున్నారు. అమూల్‌ను బాయ్‌కాట్‌(boycott amul) చేయాలని కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. దీనిపై బీజేపీ మాత్రం.. అమూల్‌ని ఎదుర్కొనే సత్తా నందినికి ఉందని.. నందినిని ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయిస్తున్నారని… నాయకులు చెప్పుకొస్తున్నారు.