Amit Shah: కాంగ్రెస్ హయాంలో మహిళలే నష్టపోయారు
కాంగ్రెస్ (congress) హయాంలో మహిళలే ఎక్కువగా నష్టపోయారని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) . పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు (women’s reservation bill) గురించి అమిత్ షా ప్రస్తావించారు. ఒక్క BJP తప్ప ఇతర పార్టీలన్నీ రిజర్వేషన్ బిల్లును పొలిటికల్ ఎజెండాలాగే చూస్తున్నాయని అన్నారు. ఇక దేశాన్ని అభివృద్ధి చేసే పనుల్లో మహిళలకు కూడా హక్కు ఉంటుందని తెలిపారు. ఇది భారత దేశ చరిత్రలోనే గోల్డెన్ మొమెంట్ అని.. వినాయక చవితి రోజున కొత్త పార్లమెంట్‌లోకి ప్రవేశించడమే కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా మోదీ ఆమోదం తెలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ బిల్లుని ఆమోదిస్తే లోక్ సభ, రాజ్య సభ, విధాన సభల్లో మహిళలకు 33% కోటా ఉంటుందని .. ఎప్పటినుంచో పోరాడుతున్న మహిళలకు ఈ కోటా విజయాన్ని ఇస్తుందని తెలిపారు. మోదీ ప్రధాని అయినప్పుడు దేశంలోని 70 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు లేవని.. దాంతో ఆయన జన్ ధన్ యోజనను ప్రారంభించారని గుర్తుచేసారు. మోదీ కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా నష్టపోయింది మహిళలే అని గుర్తుచేసారు. (amit shah)