చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో తమిళిసైకి మాస్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా
Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. భారతీయ జనతా పార్టీ నేత తమిళిసై కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఆమె స్టేజ్‌పై ఉన్న వెంకయ్య నాయుడు, అమిత్ షాలను పలకరించేందుకు వెళ్లగా.. అమిత్ షా తమిళిసైకి ఏదో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై కారణమని తమిళిసై ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ అంశంపై అమిత్ షా ఇలా అందరి ముందు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.