AP Election: ముంద‌స్తు లేన‌ట్లేనా?

AP: ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు (ap election) వెళ్తుంద‌ని వ‌ర్గాలు అన్నాయి. అయితే దీనిపై క‌చ్చితంగా ఏ విష‌యం అనేది సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ap cm jagan mohan reddy) చెప్ప‌డంలేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే.. తెలంగాణ ఎన్నిక‌లు అయ్యాకే ఏపీ ఎన్నిక‌లు జరుగుతాయ‌ట‌. జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లరు అని కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah).. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో (pawan kalyan) అన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దాంతో ప‌వ‌న్ కూడా ప్ర‌చారానికి కాస్త బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటార‌ని తెలుస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయేమో అన్న ఉద్దేశంతోనే ప‌వ‌న్ ఫాస్ట్‌గా త‌న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసారు. ఇంకొన్ని సినిమాలైతే ఏకంగా ఆగిపోయాయి కూడా. ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌లు లేవు అన్న క్లారిటీ వ‌చ్చేస్తే.. పెండింగ్‌లో ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ అయిపోతాయ్.