Israel Gaza War: మీరు గెల‌వాలి.. నెత‌న్యాహుకు చెప్పిన సునాక్

యుద్ధ బీభ‌త్సంలో చిక్కుకుని ఇప్పుడు గాజాపై ప్ర‌తీకార చ‌ర్య‌కు దిగిన ఇజ్రాయెల్‌కు (israel gaza war) బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ (rishi sunak) మ‌ద్ద‌తు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈరోజు ఉద‌యం ఇజ్రాయెల్‌లో (israel) ప‌ర్య‌టించారు. త‌న‌కు చేత‌నైనంత సాయం చేస్తాన‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహుకు (benjamin netanyahu) చెప్పారు. అంతేకాదు.. ఈ యుద్ధ పోరులో ఎలాగైనా ఇజ్రాయెలే గెల‌వాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

అర‌బ్ దేశాలైన ఈజిప్ట్, ఇరాన్, UAE, బహ్రైన్, జోర్డాన్, ట‌ర్కీలు గాజాలోని హాస్పిట‌ల్‌పై జ‌రిగిన దాడికి ఇజ్రాయెలే కార‌ణం అంటున్నాయి. అమెరికా, బ్రిట‌న్, ఇండియా మాత్రం ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. నిన్న అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టించారు. ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయం కూడా ప్ర‌క‌టించారు. (israel gaza war)