Chandrayaan 3: ఈ ఘ‌న‌త మాదే.. కాదు మాదే..!

చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్ స‌క్సెస్‌ఫుల్ అవ్వ‌డానికి ఇంకొన్ని గంట‌లే మిగిలి ఉంది అన‌గా.. క్రెడిట్ ఎవ‌రి ఖాతాలో ప‌డాలా అనేదానిపై చ‌ర్చ‌కు దిగాయి BJP కాంగ్రెస్ (congress) పార్టీలు. చంద్ర‌యాన్ మిష‌న్‌కి కార‌ణం మేమే అంటే మేమే అంటూ ట్వీట్ల‌తో యుద్ధం చేసుకుంటున్నాయి. మొదటి ట్వీట్ కాంగ్రెస్ నుంచి వ‌చ్చింది. “” మీకు ఈ విష‌యం తెలుసా..చంద్ర‌యాన్ 1 మిష‌న్‌ను 2008లో శ్రీహ‌రి కోటలో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలో విజ‌యం సాధించింది “” అని ట్వీట్ చేసారు.

వెంట‌నే BJP ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా (amit malviya) మ‌రో ట్వీట్ వేసారు. “” కాంగ్రెస్ నుంచి తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌ర‌కు భార‌త‌దేశ స్పేస్ టెక్నాల‌జీ నుంచి విజ‌య‌వంత‌మైన మిష‌న్ల‌పై క్రెడిట్ తీసుకునే కంటే ముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో ఈ 9 ఏళ్ల‌లో ఎంతో చేసారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, మ‌న్మోహ‌న్ సింగ్ కంటే ఎక్క‌వ ఘ‌న‌త‌లు సాధించింది మోదీ నాయ‌క‌త్వంలోనే “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక లాస్ట్ టచ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (mamata banerjee) ఇచ్చారు. చంద్ర‌యాన్ 3 అనేది యావ‌త్ భార‌దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. ఇస్రో అనేది ఏ పార్టీకి చెందిన‌ది కాద‌ని అది భార‌త‌దేశానికి చెందిన‌ద‌ని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్త‌ల కృషి వ‌ల్లే ఎన్నో ఘ‌న‌తలు సాధించారు కానీ ఏ రాజ‌కీయ పార్టీ వ‌ల్ల కాద‌ని సెటైర్ వేసారు. వెస్ట్ బెంగాల్‌తో స‌హా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్త‌లు ఈ చంద్ర‌యాన్ మిష‌న్ కోసం ప‌నిచేసారు అని సామ‌రస్యంగా వెల్ల‌డించారు.