బంగ్లాదేశ్ అల్లర్ల వేళ షేక్ హసీనాకు అమెరికా షాక్
America: బంగ్లాదేశ్‌లో అల్లర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీలో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. హసీనా యూకే వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఆ దేశం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఎక్కడ యూకే అనుమతించకపోతే హసీనా అమెరికాకు వస్తారో అని భయపడి ముందుగానే ఆమె అమెరికన్ వీసాను రద్దు చేసేసారు.
దాంతో హసీనా అమెరికాకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. యూకే అనుమతించకపోతే హసీనా ఎక్కడికి వెళ్తారు అనే దారిపై ఉత్కంఠ సాగుతోంది. ఎందుకంటే ఏ దేశం ఆశ్రయించకపోతే హసీనా భారత్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హసీనాతో పాటు ఢిల్లీకి వచ్చిన ఆమె సోదరికి మాత్రం యూకే పౌరసత్వం ఉంది. దాంతో తన సోదరిని వదిలేసి ఆమె యూకే పారిపోయే పనిలో ఉన్నారు.