EXCLUSIVE: TDPలోకి రాయుడు..!
EXCLUSIVE: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (ambati rayudu) కొన్ని రోజుల క్రితమే YSRCP పార్టీలో చేరి ఈరోజే ఆ పార్టీకి రాజీనామా చేసేసారు. దాంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది. అంబటి రాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో (jagan mohan reddy) ఎప్పటినుంచో టచ్‌లో ఉన్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. ఇందుకు జగన్ కూడా ఒప్పుకోవడంతోనే ఆయన పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌ను చేసారు.
విచిత్రం ఏంటంటే.. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జగన్ గుంటూరుకు వచ్చినా అక్కడ రాయుడు కనిపించలేదు. అప్పుడే ఏదో తేడా కొట్టినట్లు అనిపించింది. ఒక్కసారిగా YSRCP పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వ్యతిరేకత, వైఎస్ షర్మిళ (ys sharmila) ఎంట్రీ వంటి అంశాలు రాయుడు మైండ్‌ని బాగా డిస్టర్బ్ చేసాయని అంబటి రాయుడి సన్నిహితుడు (పేరు వద్దన్నారు) తెలిపారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే అధికారంలో ఉన్న పార్టీలోకో లేదా ప్రజల మద్దతు ఉన్న పార్టీలోకో వెళ్తారు. అంబటి రాయుడు కూడా అదే చేసారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాయుడికి తెలీని భయం పట్టుకుంది. ఎక్కడ పార్టీ ఓడిపోతుందో ఎక్కడ తన రాజకీయ జీవితం మధ్యలోనే అంతమైపోతుందో అని ఆలోచించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పార్టీకి రాజీనామా చేసేసారు.
తెలుగుదేశం పార్టీలోకి?
కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు రాయుడు ప్రకటించారు. అయినప్పటికీ ఆయన చూపు తెలుగు దేశం పార్టీ (TDP) వైపు పడిందని స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో శత్రువులు మిత్రులు మిత్రులు శత్రువులు అవడం సహజమే. మొన్నేదో రాయుడు చంద్రబాబు నాయుడిపై ఆయనే ఐటీ తెచ్చానని చెప్పుకుంటున్నారు అంటూ సెటైర్ వేసారు. ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని తెలుగు దేశం పార్టీలోకి వెళ్తారు అనే అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. కానీ అంబటి రాయుడు లాంటి ఫేమస్ వ్యక్తి తమ పార్టీలో ఉంటే తమకే మంచిది అనుకోని వారు ఉండరు. పైగా ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ ఎవరు వచ్చినా అక్కున చేర్చుకునేలా ఉంది. మరి రాయుడు ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో వేచి చూడాలి.