Ambati Rayudu: బిగ్ బ్రేకింగ్.. YSRCPకి రాజీనామా
Ambati Rayudu: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల YSRCP లో చేరిన సంగతి తెలిసిందే. చేరి నెల రోజులు కాకుండానే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆడుదాం ఆంధ్రాకు బ్రాండ్ అంబాసిడర్ అయిన అంబటి రాయుడు ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొంతకాలం పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని త్వరలో తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించిన అంబటికి టికెట్ కన్ఫామ్ కూడా చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఆయన ఎందుకు తప్పుకున్నారో తెలియాల్సి ఉంది.