Ambati Rayudu: అధికారికంగా YSRCPలోకి.. గుంటూరు నుంచి పోటీ

Ambati Rayudu: ప్ర‌ముఖ క్రికెట‌ర్ అంబటి రాయుడు ఈరోజు అధికారికంగా YSRCPలో చేరారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. రాయుడు అడిగిన గుంటూరు ఎంపీ టికెట్‌ను ఇస్తాన‌ని జ‌గ‌న్ మాటిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ గుంటూరు ఎంపీగా కాక‌పోయినా పొన్నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఏదో ఒక టికెట్ ఇస్తేనే పార్టీలో చేర‌తాన‌ని రాయుడు ముందే డీల్ మాట్లాడుకున్నార‌ని స‌మాచారం.